రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ:


రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ:



నూజివీడు పట్టణంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ ,మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మచే వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది. వడ్డెర యువజన సంఘం వారిచే ఏర్పాటుచేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పరిసర ప్రాంతాలకు చెందిన వడ్డెర సామాజిక వర్గ నాయకులు తరలి వెళ్లడం జరిగింది. లింగపాలెం మండలం వడ్డెర యువజన సంఘం ప్రెసిడెంట్ గుత్తి నాగేశ్వరరావు, దేరంగుల సీతారాముడు, చల్లా వెంకటేశ్వరరావు మరియు వడ్డెర యూత్ సభ్యులు ర్యాలీగా తరలి వెళ్లడం జరిగినది.