ఆగిరిపల్లి-విజయవాడ రోడ్డులో విజిబుల్ పోలిసింగ్

ఆగిరిపల్లి-విజయవాడ రోడ్డులో విజిబుల్ పోలిసింగ్


 ఆగిరిపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణ మరియు వాహనదారుల భద్రతే ధ్యేయంగా ఆగిరిపల్లి - విజయవాడ ప్రధాన రహదారిపై పోలీసులు ఆదివారం ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆగిరిపల్లి ఎస్సై శుభ శేఖర్ మరియు ఆగిరిపల్లి  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.