చింతలపూడి నియోజకవర్గంలో 36818 మంది రైతులకు రూ.21 కోట్ల 31 లక్షల రూపాయలు జమ.
చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్.
మండలంలోని ధర్మాజీగూడెం గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3 వ విడత నిధుల విడుదల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చేతులమీదుగా రైతులకు చెక్కును అందించారు. రైతు సోదరులకు ఇచ్చిన హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడించారు.చింతలపూడి నియోజకవర్గంలో అన్నదాతలకు రూ.21 కోట్ల 31 లక్షల 'పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ' పథకం కింద మూడో విడత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.ముందుగా పీఎం మోడీ, సీఎం చంద్రబాబు ప్రసంగాలను వర్చువల్ గా తిలకించారు. రైతన్నల హర్షధ్వానాల నడుమ పూర్తిగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. రైతులతో వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ "ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి చేస్తూనే. పేదలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది. నేడు పెట్టుబడి సాయం కింద ఒక్కో రైతుకు రూ.6వేలు మూడవ విడతగా అందజేస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా రూ.14వేలు జమచేయగా నేడు ఇస్తున్న రూ.6వేలతో కలిపి, ఒక్కో రైతుకు రూ.20వేలు చెల్లించి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ కింద చింతలపూడి నియోజకవర్గంలో రూ. 21కోట్ల 31 లక్షలు రైతుల ఖాతాలో జమ చేస్తుండగా దాదాపు 36 818 మంది రైతులకు లబ్ది కలుగుతుంది.
గత వైసీపీ ప్రభుత్వం కంటే మన కూటమి ప్రభుత్వం అదనంగా సాయం అందజేస్తోంది. రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తోంది. రైతు సోదరుల తరపున ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
డ్రోన్ టెక్నాలజీని కూడా సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో 80 శాతం సబ్సిడీపై వ్యవసాయానికి ఉపయోగించే కిసాన్ డ్రోన్స్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సొమ్మును కూడా 24 గంటల లోపే రైతులకు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.బీటీ రహదారుల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేశామన్నారు. కొన్ని చోట్ల రహదారుల నిర్మాణం పూర్తి కాగా కొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎయంసి ఛైర్పర్సన్ చైర్పర్సన్ దుర్గపార్వతి మధుబాబు, మండల వ్యవసాయ అధికారులు వి. ప్రదీప్ కుమార్, కె. మురళీకృష్ణ, సి. పవన్ కుమార్, డి. ముత్యాలరావు, కూటమి నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, గుత్తా సత్య సాయి వర ప్రసాద్, గరిమళ్ళ చలపతిరావు, గారపాటి బుజ్జియ్య, నిమ్మగడ్డ సుధాకర్, బొల్లిన పుల్లారావు, మోరంపూడి ప్రసాద్,ఇనుగంటి దినేష్, మందడపు నాని, చెరువుగట్టు రామ్మోహనరావు, తాతిన రాధాకృష్ణ, గజ్జా వెంకటేశ్వరరావు, పల్లి శ్రీను, చల్లా, నాగబాబు, కుర్ర సుబ్రహ్మణ్యం ప్రసాద్, మండల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు


