ఎన్నికల వాగ్దానాలు నెరవేరుస్తున్న చంద్ర బాబు.

ఎన్నికల వాగ్దానాలు నెరవేరుస్తున్న చంద్ర బాబు.


 ఎన్నికల ముందు చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీని నిల బెట్టుకుంటూ శుక్రవారం సాయంత్రం అన్నదాత సుఖీభవ 3 వ విడత డబ్బులు రైతుల ఖాతా లో జమ చేయడం వ్యవసాయం పట్ల ఆయన కున్న అంకిత భావానికి నిదర్శనం అని చనుబండ పీ.ఏ.సీ ఎస్ ఛైర్మన్ మోరంపూ డి శ్రీనివాసరావు అన్నా రు.శుక్రవారం సాయం త్రం చనుబండ రైతు సేవా కేంద్రం వద్ద గ్రామ వ్యవసాయ సహాయకు రాలు నాగమణి ఆధ్వ ర్యంలో మోరంపూడి శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా సమావేశం ఏర్పాటు చేసి ఈ పంట నమోదు గురించి చర్చిం చి, అన్నదాత సుఖీభవ - పీ ఎం కిసాన్ కార్యక్ర మం చంద్రబాబు ప్రసం గం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా మోరం పూడి మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నా రు. రైతులు కూడా ఆధునిక పద్ధతులు అవలంభించి, సాంకే తిక పరిజ్ఞానాన్ని ఉప యోగించి మంచి దిగు బడులు సాధించి, లా భాలు గణించాలని మోరంపూడి పేర్కొన్నా రు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, గవర వెంక టేశ్వరరావు, బొట్టు దుర్గారావు, మిద్దె సత్య నారాయణ, వీ ఏ ఏ నాగమణి, పీ ఏ సీ ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.