ఏలూరుజిల్లావార్తలు.

 ఏలూరుజిల్లావార్తలు




సీతంపేటలో టుబాకో బోర్డ్ ఆధ్వర్యంలో క్షేత్రదినోత్సవం


కొయ్యలగూడెం,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 05.

ఏలూరుజిల్లా కొయ్యలగూడెం మండలం  వేలం కేంద్రం నెo 30 వ పొగాకు బోర్డు కొయ్యలగూడెం మండలం పరిధిలోని  సీతంపేట గ్రామంలో   బుధవారం నాడు వర్జీనియా పొగాకు రైతు నాగులపాటి, రాఘవరావు బేర ను దగ్గర రైతులకు టొబాకో బోర్డు అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు సాగులో పొటాషియం విడుదల చేయు బ్యాక్టీరియా వాడకం మరియు  సూక్ష్మజీవుల  సమాఖ్య వ్యవస్థ యొక్క ప్రభావం, తదితర అంశాల మీద రైతులకు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేలం నిర్వహణ అధికారి వి.శివ కుమార్ ది గ్రేట్   మాట్లాడుతూ ఫిబ్సోల్ అని ఈ సంవత్సరం నుంచి మార్కెట్ లోకి వచ్చిన కొత్త మందు గురించి, పొగాకు మొక్క పై ప్రభావం, వాటి ఉపయోగాలు, రైతుకు ఖర్చు తగ్గించటం లో వాటి యొక్క విశిష్టత వివరించారు. ఈ ఫిబ్సోల్ మరియు పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా ట్రయల్ ప్లాట్స్ వేసిన ఆరుగురు రైతులకు ప్రోత్సాహకంగా 15000 రూపాయలు పొగాకు బోర్డు తరపున అందచేయటం జరిగింది .గ్రేడింగ్ సమయంలో బుట్టలను  అందుబాటులో ఉంచుకొని అన్యపదర్థాలను అందులో వేయాలని చెప్పారు. 
బ్యారెన్ లో క్యురింగ్ సమయంలో తీసుకోవలసిన మెలుకువలు, క్యూరింగ్, గ్రేడింగ్  అప్పుడు తీసుకోవలసిన  జాగ్రత్తలు,పొగాకులో అన్యాపదర్ధాలు కలవకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు  గురించి రైతులకు సవివరంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో  ఐ.టి.సి ప్రతినిదులు శ్రీధర్ రెడ్డి  ,జి.పి. ఐ ప్రతినిది శ్రీ బాలాజీ    , పి.ఎస్.ఎస్. జి.నారాయణ , పొగాకు బోర్డు ఫీల్డ్ ఆఫీసర్ యుగంధర్ సీతంపేట రైతు నాయకులు నాగులపాటి
 రాఘవరావు సర్పంచ్ తోటకూర శ్రీనివాసరావు రైతులు బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.