యార్లగడ్డ వెంకట్రావ్ గారికి గ్రామస్తుల కృతజ్ఞతలు
గన్నవరం,(మంజీర గళం) ప్రతినిధి,
కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఓండ్రంపాడు గ్రామంలో ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న జిల్లా పరిషత్ రోడ్డుకు ఎనర్జీయస్ ద్వారా నిధులు మంజూరు చేసి తారు రోడ్ ని నిర్మాణం పూర్తి చేయించి గ్రామస్తుల రహదారి ఇబ్బందులు తొలగించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కి ఓండ్రంపాడు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గత 16 ఏళ్లుగా ఈ రోడ్డు గుంటలు పడిపోయి ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడిన గ్రామస్తులకి తారు రోడ్డు నిర్మాణంతో సుఖవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉండటంతో కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ కు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.


