అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకం
మంజీరా గళం... ప్రతినిధి ..కొయ్యలగూడెం ..
కొయ్యలగూడెం: సమాజ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకమని ప్రకాశం కళాశాలల కరస్పాండెంట్ వి. జనార్ధన్ అన్నారు. ఏపీ ప్రైవేట్ స్కూ ల్స్ అసోసియేషన్ (ఆప్సా) ఆధ్వర్యంలో గవరవరం సాయిరాకేశ్ హై స్కూల్ వద్ద అంతర్జాతీయ మహిళా దినో త్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీ మాజీ సభ్యురాలు ఎస్. సుభద్రదేవి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల మహిళలు శ్రద్ధ
తీసుకోవాలన్నారు. హై కోర్టు మహిళా న్యాయవాది ఆర్.శ్రీవిద్య మాట్లాడుతూ పిల్లలకు ఒత్తిడి లేని విద్యను అందించాలని ఉపాధ్యాయి నులకు సూచించారు. మండలంలోని క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు సీహెచ్ వెంకట రమణ, కె. ధనలక్ష్మి, ఎన్. లక్ష్మీ లను, ప్రైవేట్ పాఠశాల ల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయినిలను, మహిళా కరస్పాండెంట్లను సత్కరించా రు. కార్యక్రమంలో ఆప్సా జిల్లా అధ్యక్షుడు ఎస్ ఆర్ ఆర్ నరసింహరాజు, డివిజన్ అధ్యక్షుడు ఐ.రాజకుమార్,
మండల శాఖ అధ్యక్షుడు కె. రవిమహేష్, జూనియర్ కళాశాలల సంఘం జిల్లా కార్యదర్శి వి ఎస్ ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.


