మండలంలో వరి పోలాల క్షేత్ర సందర్శన.

మండలంలో వరి పోలాల క్షేత్ర సందర్శన.



 మంజీరగళంప్రతినిధి)

చాట్రాయి:-

 ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో వరి సాగు రబీ సీజన్ కు 2,780 ఎకరాలు సాగు లో ఉన్నదని మండల వ్యవసాయాధికారి బి శివ శంకర్ తెలిపారు. మండలంలో వరి పొలాలను క్షత్రస్తాయి లో సందర్శించి రైతు లకు తగిన చూచనలు ఇస్తున్నట్లు,ప్రస్తుతం వరిపంట దుబ్బు చేసే దశలో ఉన్నదనీ,  రైతులు సమగ్ర పోషక మరియు యాజమాన్య పద్ధతులను నీటి ఎద్దడి లేకుండా 5 సెంటీమీటర్ల నీటి మట్టాన్ని గమ నించుకోవాలనీ,వరి వేరు వ్యవస్థ పైన మాత్రమే ఉంటుంది కాబట్టీ 5 సెంటీమీటర్లు నీటిమట్టంను కచ్చితం గా ఉండేలా చూసు కోవాలన్నారు.వరిలో కాండం తోలుచు పురుగును గమనించి నట్లయితే పసుపు గోధుమ వర్ణంలో ఉన్న రెక్కల పురుగులు ఆకుల కొనలపై ఉదయం సమయంలో కనబడతాయని,గుడ్లు, సముదాయం ఆకుల పైన కనబడుతుందనీ, పురుగులు కాండంలో

నికి ప్రవేశించి గుజ్జుని తినడం వలన మొవ్వు ఎండిపోతుందని తెలిపారు.ఎండిన మొవ్వలు పీకిన యెడల సులువుగా ఊడి వస్తాయనీ,పూత దశలో ఈ పురుగు ఆశించిన యెడల కంకి తెల్లగా అయిపో తుంద న్నారు. రైతులు దీని నివారణ కొరకు పిలక దశలో కార్బో ఫ్యూరాన్ 3జి 10 కేజీలు లేక 4 జి గుళికలు 8 కేజీలు కార్టప్ హైడ్రోక్లోరైడ్ చల్లు కోవాలని తెలి పారు.అంకురం ఏర్పడే దశలో క్లోరోన్ ట్రిలిని ప్రోల్ 20 sc మందును 60 ఎం.ఎల్ ఒక ఎకరానికి లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ 50 డబ్లు పి మందును 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని అన్నారు. గురువారం పోలవరం గ్రామంలో వరి క్షేత్రాల ను సందర్శించడం జరిగింది . ఈ కార్య క్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.