అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక


 

అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక

అన్నదాత సుఖీభవ పథకం-రైతన్నలకు వరం

రైతన్నలు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
 
రైతు సంతోషంగా ఉంటే.. రాష్ట్రం ఆనందంగా ఉంటుంది

సాగులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాము

జిల్లాలో మూడవ విడతగా రూ 89.85 కోట్లు 1,60,968 రైతులకు లబ్ధి

 అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్" మూడవ విడత కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు ...

 ఏలూరు/ ముసునూరు, మార్చి 13: ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో శుక్రవారం "అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్" మూడవ విడత కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొన్నారు. మంత్రితోపాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గం 35,529 మంది రైతులకు రూ 19.77 కోట్లు, ముసునూరు మండలం 8,205 మంది రైతులకు రూ 4.64 కోట్లు నమూనా చెక్కులను మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంయుక్తంగా రైతులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటే.. రాష్ట్రం ఆనందంగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం రైతుకి అన్నివిధాలుగా వెన్నంటి ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రైతాంగానికి పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ 6వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ 14 వేలు కలిపి మొత్తంగా రూ 20 వేలు సాయం మూడు విడతలుగా అందిస్తున్నామని తెలిపారు. రైతాంగం తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు మీద, వ్యవసాయం మీద ఎంతో శ్రద్ధ ఉందని, దీని దృష్టిలో పెట్టుకుని చింతలపూడి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, దీనివల్ల ఈ ప్రాంత సుమారు 2 లక్షలు ఎకరాలకు సాగునీరు, 10 నుండి 15 వేలు మంది రైతులకు మేలు జరుగుతుందని, ఈ ప్రాంత భూములకు మంచి విలువ పెరుగుతాయని ఆలోచనతో ఆరోజు ఒక మంచి కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని అన్నారు. గత ప్రభుత్వం చింతలపూడి ప్రాజెక్టు పనులు గాలికి వదిలేసారని రూ 4 వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చేశారని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చంద్రబాబుకి పేరు వస్తుందని గత పాలకులు విషపు ఆలోచనలుతో ప్రాజెక్టు పనులు పట్టించుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే చింతలపూడి ప్రాజెక్టుకు ఉన్న కేసులు సుప్రీంకోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు తేగలిగామని అన్నారు. త్వరలో చింతలపూడి ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు చిరకాల కోరికను నెరవేర్చి తీరుతామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువలు, చెరువులు, డ్రైన్ల నిర్వహణను పట్టించుకోని కారణంగా చిన్నపాటి వర్షాల కారణంగా గ్రామాలు ముంపునకు గురయ్యేవన్నారు. జలధార కార్యక్రమం కింద ఏప్రిల్ 1వ తేదీ నుండి 90 రోజులపాటు కాలువలు, చెరువులు, డ్రైన్ల నిర్వహణ పనులు చేపడుతున్నామన్నారు. 
  గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలను రూ 1654 కోట్లను కూటమి ప్రభుత్వమే చెల్లించిందన్నారు. నాడు రైతులు పండిన ధాన్యమును సొమ్మును 6 నేలల వరకు రైతులకు జమ అయ్యేదికాదని, .నేడు కూటమి ప్రభుత్వంలో రైతులు ధాన్యమును నచ్చిన మిల్లుకు అమ్ముకోవడంతోపాటు 48 గంటల్లో బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం రైతులకు మేలు చేసే ఇన్పుట్ సబ్సిడీ, సబ్సిడీపై వ్యవసాయ ఆధునిక యాంత్రికరణ పరికరాలు వంటివి ఎన్నో ఎగ్గొట్టి వ్యవసాయ శాఖను మూత వేసి రైతులను గాలికి వదిలేసిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం రైతు క్షేమం, సంక్షేమమే ధ్యేయంగా రైతు పక్షపాతిగా పనిచేస్తుందని అటువంటి మంచి ప్రభుత్వానికి రైతాంగం అంతా ఆశీర్వదించాలని మంత్రి కొలుసు పార్థసారథి కోరారు.

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి మాట్లాడుతూ అర్హులు అయిన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ-4 పిఎం కిసాన్ మూడవ విడత రూ 6 వేలు సాయం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. ఎక్కడయినా ఒకటి లేక రెండు పడకపోయినా ఆందోళన చెందవద్దని, సంబంధిత సచివాలయంలో గాని తహశీల్దారు కార్యాలయంలో సంప్రదించాలని వెనువెంటనే జమ అయ్యేలా చూస్తామని అన్నారు. ఈ పంట నమోదు ఆన్లైన్ అగుటవలన వ్యవసాయ రంగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ప్రతి రైతు టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం చెయ్యాలని, డ్రోన్లు, ఆధునిక సాంకేతిక యంత్ర పరికరాలు సబ్సిడితో పొందవచ్చునని తెలిపారు. 40 డ్రోన్ల పంపిణీ లక్ష్యానికి గాను 52 డ్రోన్లు రైతులకు అందించామన్నారు. పకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వెయ్యాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం పొందవచ్చునని అన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్య వంతమైన సమాజాలుగా తీర్చిదిద్దుటకు రైతులు తమ వంతు పాత్ర నిర్వహించాలని అన్నారు. వ్యవసాయం చేయాలంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందుపుచ్చుకుని ప్రతి రైతు లాభసాటి వ్యవసాయాన్ని చేసుకోవాలని సూచించారు. కోకో, ఆయిల్ ఫామ్ లు వేసుకుని రైతులు అధిక లాభాలు పొందాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ, సహకారాలు అందించుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. నూజివీడు మామిడికి ఉన్న ఇబ్బందులను తొలగించి నూజివీడు మామిడి బ్రాండు ఇమేజీని మరింత పెంచేలా కృషి చేస్తామని, మామిడి రైతులకు 30 లక్షల ఫ్రూట్ కవర్లు అందిస్తున్నామన్నారు. అన్నారు. జిల్లాలో 500 వుడ్ ప్రాసెసింగు యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించమని, యువతీ, యువకులు ముందుకు రావాలని, కావలసిన మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో రైతులు పండిస్తున్న లేదా తయారు చేయుచున్న సేంద్రియ సహజ సిద్ధమైన ఉత్పత్తులు రైతు వివరాలను ఆన్లైన్ ప్లాట్ఫామ్ (వెబ్ పోర్టల్) "ఏలూరు రైతు సంపద". ఈ పోర్టల్ నందు పొందుపరచడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ (వెబ్ పోర్టల్) "ఏలూరు రైతు సంపద" ఈ పోర్టల్ ను వినియోగించు కోవాలని కోరారు. ఈ పోర్టల్ నందు సింద్రీయ మరియు సహజ సిద్ధమైన వివిధ రకాల బియ్యం, తేనే, పసుపు, మిరియాలు, పచ్చళ్ళు, గృహ వినియోగ వస్తువులు ఉంచటం జరిగినది. ఆసక్తి కలిగిన వారు ఈ లింకు https://www.elurarythusampada.in/ ద్వారా క్రయవిక్రయాలు జరపవచ్చునన్నారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాష, ఉద్యానవన శాఖ అధికారి షాజా నాయక్, ఎంఐపి పీడీ రామ్మోహన్, ఎంపిపి కె. భవాని, సర్పంచ్ రాధిక, వివిధ శాఖలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, రైతు సంఘాలు నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

    ఈ సందర్భంగా రైతులు, ఉద్యానవన రైతులు ఏర్పాటుచేసిన స్టాల్ల్స్ ను మంత్రి పార్థసారధి, కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. 

  దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్న అన్నదాతా సుఖీభవ, పి .ఎం. కిసాన్ పంపిణీ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలు వీక్షించారు.