రాష్ట్రంలోనే అనపర్తి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు

రాష్ట్రంలోనే అనపర్తి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు 



రాజమహేంద్రవరం, మంజీరగళం  ప్రతినిధి:
 అనపర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు లో అనపర్తి నియోజకవర్గం లో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఆ పార్టీ రాష్ట్రస్థాయిలో విజయం సాధిస్తుందని గత ఎన్నికల ఫలితాల ద్వారా చెప్పకనే చెబుతున్నాయని కూటమి నాయకులు పేర్కొన్నారు. అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గాన్నిఅభివృద్ధిలోరాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధిలో భాగంగానే తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి  సిసి రోడ్లు సిసిడ్రైన్లు సామర్లకోట రాజమండ్రి కెనాల్ రోడ్ నిర్మాణం చేపట్టారన్నారు. అనపర్తి శాసనసభ్యులు అసెంబ్లీలో కాటన్ బ్యారేజ్ మరమ్మత్తులు, రైతులు, కౌలు రైతుల ఇబ్బందులను, పంట కాలువలు డ్రైనేజీ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయాలని, అంగన్వాడీల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని  ప్రజావాణిని తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వానికి వివరించారని కూటమి నాయకులు పేర్కొన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో నుంచి అనపర్తి నియోజకవర్గానికి మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తున్నారని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందారని  కూటమినాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జుత్తుక సూర్య కుమారి కూటమి నాయకులు టి శివ రామారెడ్డి సొసైటీ అధ్యక్షులు గోపికృష్ణ రెడ్డి  ఆర్ నాగు జుత్తుక కృష్ణ జుట్టుకు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.