చొప్పరమెట్ల శ్రీ శ్రీ మద్దిరావమ్మ తల్లి వార్షికోత్సవం

 చొప్పరమెట్ల శ్రీ శ్రీ మద్దిరావమ్మ తల్లి వార్షికోత్సవం




ఆగిరిపల్లి మంజీరగళం ప్రతినిధి:

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలంలోని చొప్పరమెట్ల గ్రామపంచాయతీ పరిధిలో శ్రీ శ్రీ శ్రీ మద్దిరావమ్మ తల్లి వార్షికోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా గురువారం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి అమ్మవారికి విశేష అలంకరణ చేశారు.
వార్షికోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి సుమారు 3 వేల మందికి ప్రసాదం అందించారు.
గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు కలిసి ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. భక్తులందరూ అమ్మవారిని ప్రార్థిస్తూ శాంతి, సౌభాగ్యం, సిరిసంపదలు కలగాలని కోరుకున్నారు.