ఏలూరు /నూజివీడు :నూజివీడు పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చిన బీసీ సంక్షేమ మరియు జౌల శాఖ మాత్యులు సవితమ్మను రాజీవ్ సర్కిల్ సెంటర్ నుండి రంగ రంగ వైభవంగా బైక్ ర్యాలీతో పూల వర్షంతో రంగ రంగ వైభవంగా ఆర్ఆర్ పేట వరకూ కొనసాగిన బైక్ ర్యాలీ. అనంతరం వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ చేసిన ఇరువురు మంత్రులు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మొదటిగా బీసీ సంక్షేమ మంత్రివర్యులు సవితమ్మ మాట్లాడుతూ బీసీకి వెన్నుముక తెలుగుదేశం పార్టీ అని బీసీ వర్గాలకు అణగారిన వర్గాలకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పునాది వేసింది నందమూరి స్వర్గీయ ఎన్, టి,రామారావు అని అన్నారు.
ఆ పునాదుల మీద కోటను కట్టింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గతంలో కూలీ నాలీ చేసుకుంటూ జీవనం కొనసాగించిన వెనుకబడిన తరగతులు ఆనాడు నందమూరి తారక రామారావు పెట్టిన రాజకీయ భిక్షతో అనేకమంది చట్ట సభలకు ప్రవేశించి సమాజానికి ఎన్నో సేవలు చేస్తున్నారన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆస్తి హక్కులో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కానీ చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం కానీ అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన కృషి అని కొనియాడారు. వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ చేయడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. ఆనాడు బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన నర్సారెడ్డి అనుచరులలో ఒక్కరైనా వడ్డే ఓబన్న గొప్ప పోరాట వీరుడని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
నీతి నిజాయితీ నిబద్ధత ధర్మం తోటి వారికి సహాయం చేయడంలో బీసీలకు బీసీలే చాటి అన్నారు బీసీలకు పెద్దపీట వేసి నేడు క్యాబినెట్లో 8 మంది బీసీ వర్గాల మంత్రులు ఉన్నామని దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. కొండలను పిండి చేసి ఎక్కడ కట్టడాలు కట్టిన దేశం నలుమూలల వడ్డెర జాతి శ్రమ ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ...నాడు చరిత్రకారులు చరిత్రను విస్మరించి చరిత్రలో కొంతమంది బీసీ ఎస్టీ ఎస్టీ నాయకులను చరిత్రలో చేర్చకుండా కనుమరుగు చేశారని పేర్కొన్నారు దానికి ఉదాహరణ పల్నాడు కి చెందిన యాదవ నాయకుడు మరియు కర్నూలుకు చెందిన వడ్డే ఓబన్న ఇలా చరిత్రలో పరిశీలిస్తే వెనుకబడిన తరగతుల పోరాట వీధులు నాయకులు ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నామని పేర్కొన్నారు. బి, సీ, లు అంటే మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉన్న నాయకులు అని గుర్తు చేశారు. ఓబన్న జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించి కూటమి ప్రభుత్వం బి, సి, ల గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.
మరియు గౌతు లచ్చన్న జన్మదినాన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించి బి, సి, ల ఆత్మ గౌరవాన్ని పెంచారన్నారు.2024-19 లో కార్పొరేషన్లు ప్రవేశపెట్టి బి, సి, లకు వివిధ రకాల ఛైర్మన్ పదవులు ఇచ్చి గౌరవించి బి, సి, లను అక్కున చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ అని గుర్తుచేశారు.ఉగాదికి మెగా జాబ్ మేలాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం అని అన్నారు. బీసీ రక్షణ చట్టం అమలు చేసే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. బీసీలకు ముఖ్యంగా వడ్డెరకు మైనింగ్ వ్యాపారంలో రిజర్వేషన్ కల్పించడం కోసరం కృషి చేస్తుందన్నారు.
ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తను తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వచ్చే సంవత్సరంలో పోలవరం పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ 150 151 గెలుస్తారని ప్రగాఢ పలుకులు పలికిన ముఖ్యమంత్రి ఏమయ్యారని ప్రశ్నించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెచ్చిన ఆస్తి హక్కులో మహిళలకు వాటా కల్పించిన చట్టాన్ని సైతం తుంగలో తొక్కి చెల్లికి తల్లికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
రానున్న మూడు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలో సగభాగం ఓటు బ్యాంకింగ్ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారని అలాంటివారికి అనేక సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నారు.
మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే రూ.10,000 నుండి రూ.20 వేలు పెంచిన కూటమి ప్రభుత్వమని, గౌడ కులస్తులకు బార్ షాపులో పది శాతం రిజర్వేషన్ కేటాయించిన కూటమి ప్రభుత్వము అని గుర్తు చేశారు. నాయి బ్రాహ్మణ సోదరులకు 200 యూనిట్స్ విద్యుత్ రాయితీ చేనేత కార్మికులకు విద్యుత్ రాయితీ, ఇచ్చినా ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. మరియు దీపం పథకం ఉచిత బస్సు సర్వీసు తల్లికి వందనం ఎస్సీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం మాది అన్నారు.
రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలను ఆర్థికంగా సామాజికంగా ఆదుకుంటూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళుతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. డిఎస్సి ద్వారా సుమారు 17 వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు నియమించిన ప్రభుత్వం మా ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గౌడ్ సంఘ చైర్మన్ మరియు వడ్డెర సంఘ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.



