సూర్యదేవుని దర్శించుకున్న విక్రమాదిత్య

 సూర్యదేవుని దర్శించుకున్న విక్రమాదిత్య


రాజమహేంద్రవరం, మంజీర గళంప్రతినిధి:

 అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయణ మూర్తిని సన్ స్పిరిచువల్  సొసైటీ స్థాపకుడు విజిటబుల్ థెరపీస్ట్  (నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి) విక్రమాదిత్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భారతదేశంలోనే ఏకైక వైష్ణవ సాంప్రదాయంలోపూజలుఅందుకుంటున్న స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.  పుట్టినరోజు సందర్భంగాఅనపర్తిలో నాయనమ్మ ఇంటివద్ద రెండు రోజులుగా సౌర హోమం నిర్వహించమన్నారు. ఆదివారం అనపర్తి గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు అన్న ప్రసాద వితరణ చేసామని, సాయంత్రం అమ్మమ్మ ఊరు గొల్లల మామిడాడ లో  సూర్య దేవుడినికుటుంబ సమేతంగా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సూర్య ఆరాధన ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని ఇప్పటికే సన్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా విజిటబుల్స్ థెరపి సూర్య ఆరాధననతో అనారోగ్యంగా ఉన్న వారికి మందులతో పని లేకుండా నివారణ మార్గాలు సూచిస్తున్నామన్నారు.