సీఎంఆర్ఎఫ్ తోపేదల ఆరోగ్యానికి భరోసా. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.
ఏలూరుజిల్లా చింతలపూడి ఎంతోమంది పేద ,బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి తన సహాయనిధి ఆదుకుంటున్నారని శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు.
మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో 33 మందికి సుమారు 18 లక్షల రూపాయలు సీఎం సహాయం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనారోగ్యానికి గురై ఆర్థికంగా స్తోమత లేని ఎన్నో పేద కుటుంబాల వారికి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపకరిస్తుందని రోషన్ కుమార్ పేర్కొన్నారు.
గతంలో ఏ ప్రభుత్వంలో ఇవ్వని విధంగా తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు ఇచ్చి ఆ యొక్క కుటుంబాలను ఆదుకుంటున్నారని పునరుద్ఘాటించారు.


