గడిచిన ఐదు సంవత్సరాలలో రామానుజాపురం పంచాయతీఅభివృద్ధి చేశా ను సర్పంచ్ అడపా నాగ లక్ష్మీ రాంబాబు
ఏలూరుజిల్లా కొయ్యలగూడెం మండకం రామానుజపురం గడిచిన ఐదు సంవత్సరాలలో రామానుజాపురం పంచాయతీ అభివృద్ధి పథకంలో నడిపించాను అనిసర్పంచ్ అడపా నాగలక్ష్మి రాంబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో 9 సీసీ రోడ్లను 12 గ్రావెల్ రోడ్లను మిషనరీ వారి సహకారంతో నూతన బోర్లు వేయటం జరిగింది అన్నారు మంచినీటి సదుపాయం కోసం కొత్త మోటర్లు మూడు ఏర్పాటు చేశామన్నారు రైతు సేవా కేంద్రం నిర్మించినట్లు తెలిపారు ఎస్సీ పేటలో కలవట్లు నిర్మించడం జరిగిందన్నారు గత ఐదు సంవత్సరాల నుండి మంచినీటి ఎద్దడి లేకుండా మంచినీళ్లు ఏర్పాటు చేశామని మౌలిక సదుపాయాలు వీధిలైట్లు డ్రైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు 39 మంది పేద మహిళలకు సీతమ్మ పెళ్లి కానుక నిమిత్తం పెళ్లి చేసుకునే పేద మహిళకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు 20 కేజీలు బియ్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు చనిపోయిన పేదవారికి 10 కేజీల బియ్యం వేయి రూపాయలు డబ్బులు అందజేసినట్లు తెలిపారు వివిధ సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో ఇంటింటికి కూరగాయలు బియ్యం పప్పు దినుసులు ఊరంతా అందజేసినట్లు తెలిపారు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సహకారంతో పంచాయితీని అభివృద్ధి పథకంలో నడిపించామని మాకు సహకరించిన గ్రామస్తులకు పెద్దలకు కూటమి నాయకులకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రామానుజాపురం సర్పంచ్ అడపా నాగలక్ష్మి రాంబాబు తెలిపారు


