కోదండరామాలయం నకు పట్టు వస్త్రాలు సమర్పించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్....

కోదండరామాలయం నకు పట్టు వస్త్రాలు సమర్పించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్



 శ్రీరామనవమి కల్యాణ మహోత్సవం సందర్భంగా ధర్మాజీగూడెం గ్రామంలో శుక్రవారం హైస్కూల్ రోడ్డులో శ్రీ సీతారామాంజనేయ ఆలయం,   తూర్పువీధిలో సీతారామాలయం, పడమట వీధిలో కోదండ సీతారామాలయం,  కాటమ రెడ్డిపల్లిలో రామాలయంలను  చింతలపూడి శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు అని అన్నారు.  ఆయన అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు మనం శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటాం. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన. అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.  శ్రీరామచంద్రమూర్తి సుగుణాలతో  ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలని, మీకు మీ కుటుంబానికి ఆ శ్రీరాముడి కృపాకటాక్షం ఉండాలని తెలియజేసారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు