ఏలూరుజిల్లా కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం పట్టణంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ మరియు కొయ్యలగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పారేపల్లి రామారావు
ఈ సందర్భంగా పారేపల్లి రామారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం రైతులకు అన్నదాత సుఖీభవ అందజేస్తుందని ఈ నేపథ్యంలో మూడవ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా నేడు మండలంలోని సుమారు 8,304 మంది రైతులుకు 4 కోట్ల 68 లక్షలు జమ చేసిందని దీనిలో 2000 కేంద్ర ప్రభుత్వం నుంచి 4000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందజేయడం జరిగిందని ఈ నగదు ద్వారా రైతులకు ముందే ఉగాది పండుగ వచ్చిందని అన్నారు రైతు మేలు కోరుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు దుగ్గిన శ్రీను ,పట్టణ అధ్యక్షులు ఆరేటి వీరపండు , మండల ప్రధాన కార్యదర్శి చిటికెన బాలగంగాధర్ తిలక్ , రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెండ్యాల రమాదేవి , జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుల అరుణ,జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ , ముప్పనపల్లి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు


