ఏలూరుజిల్లావార్తలు
శ్రీ నూకాలమ్మ అమ్మ వారి దేవస్థానంలో
ఈ నెల 15 నుండి శ్రీ నూకాలమ్మ అమ్మవారి 62 వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ
మరియు
పాలకర్రతో పందిరి రాట సుముహూర్తం.
జంగారెడ్డిగూడెం,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 06.
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవత,పట్టణానికి ఉత్తరాన కొలువైయుండి నాలుగు మాడవీధులు,నాలుగు ముఖద్వారాలు కలిగి 49 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభంతో విలసిల్లుతున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి 62 వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు మార్చి 15 ఆదివారం నుండి 22,ఆదివారం వరకూ జరగనున్నాయని ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు)ప్రకటించారు.
శుక్రవారం ఉదయం ఉదయం 8గంటల 45ని.లకు ఆలయ ధ్వజ స్తంభం వద్ద పాల కర్రను పాతిపెట్టి పందిరి రాట సుముహూర్తం
ఆలయ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
1964 నుండి ఉగాదికి నూకాలమ్మ అమ్మవారికి వార్షిక జాతర నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో 2019 లో ఆలయ పునర్ నిర్మాణం జరిగిన తర్వాత అదే రీతిలో జాతర జరుపుతూ పెద్దలు ఇచ్చిన సంప్రదాయం ఆలయ కమిటీ కొనసాగిస్తోందని ఈ సందర్భంగా వీరంపాలెం శ్రీబాలా త్రిపురసుందరీ పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకట రమణశాస్త్రి ధార్మిక మార్గనిర్దేశకత్వంలో అనేక ధార్మిక,ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజికసేవా కార్యక్రమాలు మిళితంగా కార్యక్రమాలు రూపొందించి జాతర వేడుకను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొనవల్సినదిగా కోరుతూ రొంగల నాగేశ్వరరావు ఆహ్వానించారు.
ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, మహిళలు, మరియు గ్రామ భక్త మహా జనుల ఆధ్వర్యంలో అమ్మ వారి ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆహ్వాన పత్రాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త
కే ఎల్ ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ,
కార్యక్రమ వివరాలు వెల్లడిస్తూ 15వ తేదీ ఉదయం
6:45 కు కలశస్థాపన, గరగలు తీయడం,9:00 గంటలకు శ్రీగంగానమ్మ అమ్మవారి దేవాలయం నుండి 1008 మంది ముత్తైదువులచే సుమంగళీ ద్రవ్యాలతో శోభాయాత్రగా గంగానమ్మ అమ్మవారు
తరలివచ్చి నూకాలమ్మ అమ్మవారికి సారె సమర్పణతో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయని 22 వ తేదీ
ఉదయం 9:45 గంటలకు మహాపూర్ణాహుతితో కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని వివరించారు.
ప్రతీ సంవత్సరం ఉగాదికి జరిగే వార్షిక జాతరలో పెద్దఎత్తున భక్తులు పాల్గొంటారని ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసిందని రాజాన సత్యనారాయణ (పండు)
తెలిపారు.
ప్రధానార్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ మాట్లాడుతూ నిత్య పూజా కైంకర్యాలు, అభిషేకాలు, సాయం సంధ్యా హారతి పూజలు భక్తి శ్రద్ధలతో చేశామన్నారు.
ఎనిమిది రోజులు ఆలయంలో నిర్వహించే ధార్మిక,ఆధ్యాత్మిక సేవలను వివరించారు.ఉగాది రోజు పంచాంగశ్రవణం ఉంటుందని,విశిష్టమైన పూజాకైంకర్యాలు జరుపుతామని తెలిపారు.
అమ్మ వారి వెండి చీర తయారీకి పెన్మత్స నారాయణరాజు, నీలిమ దంపతులు( వైజాగ్)50గ్రాముల వెండిని మరియు కోసూరి సుశీల 50గ్రాముల వెండిని సమర్పించారు అని, వారికి అమ్మ వారి అనుగ్రహం ఎల్లవేళల ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలోతిప్పభట్ల రామకృష్ణ శ్రీ ముత్యాలమ్మ ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పీ.వి.రామలక్ష్మి పాల్గొని, అమ్మ వారి ఉగాది ఉత్సవాల గురించి మరియు అమ్మ వారి విశిష్టత గురించి ప్రసంగించారు.మరియు ఈ సందర్భంగా చిటికెన రాంబాబు, గాలి నూకరాజు, నౌడు సత్య నూకరాజు,రొంగల పుల్లయ్య, పోలుపర్తి రాము, మండవల్లి రాంబాబు,చిట్లూరి సుబ్బారావు, పైల చంటి, ఏక శ్రీనివాస్, పెట్ల సుబ్బు,నూకారపు లోవ, పైల శ్రీను, నాళం రాజు, చింతకాయల అచ్చిరాజు, బూరి కృష్ణ, రొంగల సత్యనారాయణ, కోరుపూరి రాంబాబు తదితర పట్టణ ప్రముఖులు మహిళా సంఘాల సభ్యులు సేవా బృందాల సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారని, ప్రసాద వితరణ జరిగినదని ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలియజేశారు.


