ఏలూరుజిల్లావార్తలు
ఎమ్మెల్యే ల ప్రజాదర్బార్ లో అందిన వినతుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
10 సూత్రాలు, పీ4 కార్యక్రమాలు పూర్తి లక్ష్య సాధన చేయాలి
జిల్లాలోని నియోజకవర్గాలను ర్యాంకింగ్ లలో ముందుస్థాయిలో ఉండేలా చూడాలి
నియోజకవర్గ స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు విస్తృత అవగాహన కలిగించి ప్రభుత్వ సేవలు వినియోగించుకునేలా చూడాలి
జిల్లా అధికారులు, నియోజకవర్గ విజన్ యూనిట్ కార్యాలయాల ఇంచార్జ్ లతో జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్
ఏలూరు,(మంజీరగళం)ప్రతినిధి మార్చి , 06.
నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే లు నిర్వహించే 'ప్రజాదర్బార్' లో అందిన వినతులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం ప్రజాదర్బార్ లో వినతులు పరిష్కారం, 10 సూత్రాల అమలు, పీ4 కార్యక్రమం, వాట్సాప్ గవర్నెన్స్ , అంతర్జాతీయ మహిళా దినోత్సం నిర్వహణ, వివిధ ప్రభుత్వ పధకాల అమలుపై వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ విజన్ యూనిట్ కార్యాలయాల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే లు ప్రజాదర్బార్ లు నిర్వహించి ప్రజల నుండి పెన్షన్లు, భూ సమస్యలు, సామజిక సమస్యలపై వినతులను స్వీకరిస్తున్నారని, వాటి పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, నిర్దేశించిన సమయంలోగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ప్రతీ దశలోనూ సంబంధిత సిబ్బందితో నియోజకవర్గ విజన్ యూనిట్ కార్యాలయ సిబ్బంది పరిశీలించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న 10 సూత్రాల కార్యక్రమాలను నూరు శాతం లక్ష్యాలను సాధించేలా అధికారులు పనిచేయాలన్నారు. జిల్లాలోని ప్రతీ నియోజకవర్గ స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించేలా నియోజకవర్గ స్థాయి ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా దినోత్స కార్యక్రమంలో నిర్వహించే కార్యక్రమాలపై సంబంధిత ఎమ్మెల్యేతో చర్చించి కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు . నియోజకవర్గాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ర్యాంకింగ్ ఇస్తున్న దృష్ట్యా, సిబ్బంది 10 సూత్రాల కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు జరిగి, జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం అభివృద్ధిలో ర్యాంకింగ్ లో ముందువరసలో ఉండేలా నియోజకవర్గ విజన్ యూనిట్ కార్యాలయ పర్యవేక్షించాలన్నారు. పీ4 కార్యక్రమంలో నూరు శాతం బంగారు కుటుంబాలను మార్గదర్సులతో అనుసంధానం చేయాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ అందిస్తున్న సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించి, ప్రజలు వినియోగించుకునేలా గ్రామ స్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ విజన్ యూనిట్ కార్యాలయాల ఇంచార్జ్ లు పాల్గొన్నారు.


