ఆగిరిపల్లిలో 104 సేవల ఆకస్మిక తనిఖీ.. అంకితభావంతో పనిచేయాలని రీజనల్ మేనేజర్ ఆదేశం
ఆగిరిపల్లి : ఆగిరిపల్లి మండలంలో కొనసాగుతున్న 104 వైద్య సేవల తీరును శుక్రవారం 104 రీజనల్ మేనేజర్ హిమజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వైద్య సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్యం, షుగర్ మరియు బీపీ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వహించాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలను చేరువ చేయాలని సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఆగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ జగన్మోహన్, 104 వైద్య బృందం మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


