టీడీపీ సీనియర్ నేత డేవిడ్ రాజు మృతి పార్టీకి తీరనిలోటు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బల్లి డేవిడ్ రాజు మృతి పార్టీకి తీరనిలోటని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వ్యాఖ్యానించారు. రెడ్డిగూడెం మండలం, పాతనాగులూరు గ్రామ వాస్తవ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు బల్లెం డేవిడ్ రాజు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శుక్రవారం వారి నివాసానికి విచ్చేశారు. డేవిడ్ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధించారు. డేవిడ్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప నాయకులు డేవిడ్ రాజు అని పేర్కొన్నారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


