త్వరలో చింతలపూడి లో 2 జూనియర్ జడ్జి సివిల్ కోర్టుల భవనాలు మంజూరు.
ఏలూరుజిల్లా చింతలపూడి లో 2 జూనియర్ సివిల్ కోర్టు భవనాల నిర్మాణం చేపట్టాలని MLA సొంగ రోషన్ కుమార్ న్యాయ శాఖ మంత్రి NMD ఫరూక్ గారిని,కార్యదర్శి G . ప్రతిభా దేవిని కోరారు.
శుక్రవారం సచివాలయంలో ఆయన కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రం సమర్పించారు. అదే విధంగా కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు ను నియమించాలని విజ్ఞప్తి చేశారు.
చింతలపూడి లో 2 అదనపు కోర్టు భవనాలు 2026-27 ఆర్ధిక సంవత్సరం లో మంజూరు చేస్తామని సిబ్బందినీ నియమిస్తామని కార్యదర్శి శ్రీమతి ప్రతిభా దేవి పేర్కొన్నారు.
సిబ్బంది నియామకం అయిన తర్వాత AGP ని నియమిస్తామని ఆమె పేర్కొన్నారు.


