చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణపై అవగాహన సదస్సు
కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వై.యుగంధర్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంస్థ (ఆర్ బిఎస్ కె) అధికారిణి డాక్టర్ హిమబిందు సూచనల మేరకు గన్నవరం ఎన్ జి ఓ హోం నందు చిన్నారుల పై లైంగిక దాడుల నివారణకు అవగాహనా సదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా జరిగిన సదస్సు లో గన్నవరం మండల వైద్య అధికారిణి డాక్టర్ సృజన మాట్లాడుతూ, చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి మత్తు పదార్దాలు, అశ్లీల దృశ్యాలు కీలక ప్రభావం చూపుతున్నాయని, వాటిని నివారించేందుకు అవగాహన కల్పించడం కీలకం అని అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ అధికారిణి దీవెన మాట్లాడుతూ, పిల్లలను శారీరకంగా, మానసికంగా ఇలాంటి దురాగతాల ను ఎలా ఎదుర్కోవాలి అనేది అర్దమయ్యేలా వివరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్ ఎస్ కె రత్నకుమారి, పిల్లలకు తల్లిదండ్రులతో ఉండే సాన్నిహిత్యం, వారి ప్రవర్తనే పిల్లల మంచి తీర్చిదిద్దుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రత్నకుమారి,అనంత్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది,, పోలీసు శాఖ, విద్యాశాఖ అధికారులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.


