నగర పంచాయతీ వార్డు సచివాలయాలకు సిబ్బందిని కేటాయించండి
మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సురేషకుమార్ ను కోరిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్..
ఇటీవల మున్సిపల్ హోదా పొందిన చింతలపూడి నగర పంచాయతీలోని 5 సచివాలయాలకు సిబ్బందిని కేటాయించాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ శనివారం సచివాలయంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ని కోరారు. ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది ఇతర ప్రాంతాల్లోని మున్సిపల్ వార్డులలో పనిచేస్తున్న వారు చింతలపూడి నగర పంచాయతీకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని వారినీ డిప్యూటేషన్ పై నియమించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ విషయం పై ప్రిన్సిపల్ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు.


