జంగారెడ్డిగూడెం నూరు పడకల ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ యాదవ్

 జంగారెడ్డిగూడెం నూరు పడకల ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ యాదవ్


ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని ఆరా తీశారు, 
పేషంట్ల వద్దకు  నేరుగా వెళ్లి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు, 
ఆసుపత్రి మొత్తం కలియతిరిగి, ఆసుపత్రి శుభ్రత మీద ఆనందం వ్యక్తం చేశారు, ఆస్పత్రి కావలసిన సౌకర్యాలు, డాక్టర్ల గురించి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లును, ఆసుపత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు, 
నాలుగు మండలాలకి ముఖ్యమైన ఏరియా ఆసుపత్రి విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించద్దని ఆసుపత్రికి కావలసిన వివిధ సేవల గురించి నేను ప్రభుత్వంతో మాట్లాడతానని. 
ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్  తెలియజేశారు, 
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ బేబీ కమల, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లు కంచర్ల గణేష్,నాయుడు శ్రీను,  కూటమి నాయకులు కొండ్రెడ్డి కిషోర్, దాసరి శేషు, పారేపల్లి నరేష్ , దాకారపు కృష్ణ, కోనేటి చంటి, తూటికుంట రాము,పరిమి రాంబాబు తదితరులు పాల్గొన్నారు