జనసేన సభ్యత్వం ప్రతి వ్యక్తికి గుర్తింపు – భద్రతకు భరోసా : ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
జనసేన పార్టీ సభ్యత్వం ప్రతి వ్యక్తికి గుర్తింపుతో పాటు భద్రతను కూడా కల్పిస్తుందని, కొత్త తరం నాయకులను తీర్చిదిద్దే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
శుక్రవారం బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం 100 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ గత ఎన్నికల నాటికి ఆరు లక్షల సభ్యత్వాన్ని సాధించిందని, ఎన్నికల అనంతరం 12.5 లక్షల సభ్యులతో శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. ఈ ఏడాది మరింత ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
గత సంవత్సరం కంటే ఈసారి సభ్యత్వ రుసుమును రూ.100 తగ్గించి రూ.400గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు జనసేన సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు


