రైతుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు.
తూర్పుగోదావరిజిల్లా గోపాలపురం శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మరియు విద్యుత్ లైన్ల మార్పిడి సమస్యలను గౌరవ సభ దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ అవసరాల కోసం ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు మార్చుకోవడానికి విధిస్తున్న అధిక చార్జీలు రైతులకు భారంగా మారుతున్నాయని పేర్కొంటూ, ఆ చార్జీలను తగ్గించి రైతులకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ముఖ్యంగా పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులు విద్యుత్ లైన్లు తోటల సమీపంలో ఉండటంతో అనేక ఇబ్బందులు మరియు ప్రమాదాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
మద్దిపాటి వెంకటరాజు
శాసన సభ్యులు, గోపాలపురం నియోజకవర్గం


