జర్నలిస్టులకు ఇళ్ళు , ఇళ్ల స్థలాల కోసం ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన

 జర్నలిస్టులకు ఇళ్ళు , ఇళ్ల స్థలాల కోసం ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన 


మార్చి4న ఛలో విజయవాడ.

ఎపిడబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్ష,రాష్ట్ర ప్రధాన  కార్యదర్శులు ఎస్ వెంకట్రావు, జి. ఆంజనేయులు పిలుపు మేరకు పెద్ద సంఖ్య లో జర్నలిస్ట్ లు పాల్గొనాలని జంగారెడ్డిగూడెం డివిజన్ అధ్యక్షులు పి ఎన్ వి రామారావు, నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్సులు చిన్నారావు, గొల్ల మందల శ్రీనివాస్ కోరారు.ఈ మేరకు గురువారం మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రం లో 

అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 4న చలో విజయవాడ కార్యక్రమంవిజయ వంతం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

 ప్రతి జర్నలిస్టు పాల్గొని జయప్రదం చేయాలని వారుకోరారు సంఘ సభ్యులతో కలిసి ఛలో విజయ వాడ పోస్టర్ ను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఫెడరేషన్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఇల్లు, ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చెశారు.ప్రభుత్వాలు హామీలు ఇస్తున్న వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఎన్నికల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం కేటాయించడంతోపాటు ఇల్లు కూడా మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వృద్ధాప్యంలో ఉన్న జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి కే ఎస్ శంకర రావు మాట్లాడుతూ  ప్రభుత్వాలు మారు తున్నా జర్నలిస్ట్ ల సమస్యలు అలాగే వుంటున్నాయని వాపోయారు. ప్రజలకు పాలకులకు వారధి వంటి పాత్రికేయులను ఎన్నికల తరువాత విస్మరించటం బాగా లేదని విచారం తెలిపారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలసాధన కై 4న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమంలోపోలవరం, చింతల పూడి, గోపాలపురం నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఉపాధ్య క్షుడు కొత్తూరి రవి కిరణ్,జాయింట్ సెక్రటరీ కలపాలశ్రీనివాస్ రాఘవులు సీనియర్ జర్నలిస్ట్ లు ఉప్పాల కృష్ణ, అద్దేటి వెంకటేశ్వరరావు, గరువు బాబూ రావు, నాగరాజు బి ప్రసాద్ రాజు  తదితరులు పాల్గొన్నారు.