అసెంబ్లీ సమావేశాల్లో గోపాలపురం నియోజకవర్గ సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు.

 అసెంబ్లీ సమావేశాల్లో  గోపాలపురం నియోజకవర్గ సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు.

తూర్పుగోదావరిజిల్లా“గోపాలపురం నియోజకవర్గ ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 1,027 మందికి రూ.9 కోట్లు 20 లక్షల ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు, వందలాది మంది ప్రాణాలను కాపాడేందుకు తోడ్పడిన గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు  మద్దిపాటి వెంకటరాజు.”


“గోపాలపురం నియోజకవర్గం గుండా 55 కిలోమీటర్లు విస్తరించి ఉన్న నేషనల్ హైవే - 16 పై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పి హెచ్ సి ఎస్) కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా (సి హెచ్ సి ఎస్) అభివృద్ధి చేయడం అవసరం. అలాగే హైవేకు సమీప ప్రాంతాల్లో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించి అనేక అమూల్యమైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.

అందువల్ల గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న పి హెచ్ సి ఎస్ ను సి హెచ్ సి ఎస్ గా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.”

ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, చిన్న తిరుపతి గా ప్రసిద్ధి చెందుతూ ప్రతిరోజూ సుమారు 10,000 నుండి 15,000 మంది భక్తులు దర్శనార్థం విచ్చేస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో భక్తులు మరియు స్థానిక ప్రజలు ఉండటంతో, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండటం ఎంతో అవసరం.

ప్రస్తుతం ద్వారకాతిరుమల మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి హెచ్ సి) ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి హెచ్ సి) గా అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన వైద్య సేవలు, అత్యవసర చికిత్స సౌకర్యాలు, మరింత మంది వైద్య సిబ్బంది మరియు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయి.

దీనివల్ల స్థానిక ప్రజలతో పాటు ప్రతిరోజూ వచ్చే వేలాది మంది భక్తులకు కూడా తక్షణ వైద్య సేవలు అందించి, ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయవచ్చు. అందువల్ల ద్వారకాతిరుమలలో ఉన్న పి హెచ్ సి ను సి హెచ్ సి గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతున్నాను.

దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (కో.పి హెచ్ సి) నిర్మాణానికి అవసరమైన స్థలంగా సుమారు మూడు ఎకరాలను శ్రీ దుగ్గిరాల రత్నాజీ గారు ఒక రైతు ఆయన స్వచ్ఛందంగా విరాళంగా అందజేయడం జరిగింది.

అదేవిధంగా, కో-పి హెచ్ సి నిర్మాణం కోసం దాతలు కూడా స్వచ్ఛందంగా నిధులను సమకూర్చారు . ఈ కేంద్రం నిర్మాణం ద్వారా యర్నగూడెం మరియు పరిసర గ్రామాల ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి, గ్రామీణ ఆరోగ్య సేవలు మరింత బలోపేతం అవుతాయి అని కోరుతున్నాను.