ప్రజా స్వామ్యానికి నాలుగో స్థంభం జర్నలిజం

 ప్రజా స్వామ్యానికి నాలుగో స్థంభం జర్నలిజం 

ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ మీడియా డైరీ ఆవిష్కరణ లో ప్రముఖ ఆడిటర్ దాకారపు కృష్ణ

ఏలూరుజిల్లాప్రజాస్వామ్యంలో జర్నలిజం నాలుగో స్థంభం అనే భావన చాలా ప్రాచుర్యం పొందిందని

ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా పాత్రను సూచిస్తుందని ప్రముఖ ఆడిటర్ తెలుగు దేశం పార్టీ యువనేత రొటేరియన్ దాకారపు కృష్ణ పేర్కొన్నారు.

 మొదటి మూడు స్థంభాలు

శాసన సభపార్లమెంట్ లేదా అసెంబ్లీ, రెండో ది కార్యనిర్వాహక వర్గం అనగా ప్రభుత్వం

మూడోది న్యాయవ్యవస్థ 

ఇక నాలుగో స్థంభంగా పరిగణించబడేది మీడియాఅన్నారు.

గురువారం ఇక్కడ కాలేజీ రోడ్డు లోని తమ కార్యాలయం లో కృష్ణ ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ మీడియా డైరీ ని ఆవిష్కరించారు.కార్యక్రమం లో  పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్బంగా కృష్ణ మాట్లాడుతూ ప్రజలకు సమాచారాన్ని అందించడం, ప్రభుత్వాన్ని నియంత్రించడం ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేయడం వంటి పాత్రలను జర్నలిజం పోషిస్తుందన్నారు.ప్రస్తుతం జర్నలిజం కూడా రూపంతరం చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా నీకార్సైన జర్నలిజం ఎప్పటికి నిలిచే ఉంటుందన్నారు.ఏపీ డబ్ల్యూ జెఫ్  మరింతగా అభివృద్ధి చెందాలని ప్రజలపక్షాన వెన్ను దన్నుగా ఉండాలని కోరారు.

కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి, మీడియా అక్రిడి టేషన్ కమిటీ మెంబర్ కె ఎస్ శంకర రావు మాట్లాడుతూ జర్నలిస్ట్ ల పట్ల అభిమానం జర్నలిజం యెడల గౌరవం కలిగిన వున్నత విద్యా వంతుడు కృష్ణ వంటి వారు మీడియా లో వున్న వారికి 

సహాయ సహకారాలు అందించాలని కోరారు.

నియోజకవర్గం కార్యదర్శి గొల్ల మందల శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు  పి ఎన్ వి రామా రావు, జిల్లా సహాయ కార్యదర్శి కలపాలశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.