మారుతున్న చట్టాలు మెరుగైన న్యాయం


 మారుతున్న చట్టాలు మెరుగైన న్యాయం

 ఆగిరిపల్లిలో నూతన చట్టాలపై అవగాహన సదస్సు

నూజివీడు /ఆగిరిపల్లి :ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం పౌరులకు నూతన శిక్షా స్మృతిపై అవగాహన కల్పించే దిశగా కీలక అడుగులు వేస్తోంది.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS వారు నూజివీడు డిఎస్పీ శ్రీ కె. వి.వి .ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు ఆగిరిపల్లిలో ఈ సదస్సు నిర్వహించినారు.

నూజివీడు రూరల్ ఇన్స్‌పెక్టర్ రామకృష్ణ,ఆగిరిపల్లి ఎస్.ఐ శుభశేఖర్ మరియు సిబ్బంది.
అవగాహన కార్యక్రమమును నిర్వహించినారు.
ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ ప్రధాన కూడలిలో జరిగిన ఈ కార్యక్రమం లో, బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన చట్టాల గురించి ప్రజలకు మరియు ప్రయాణి కులకు వివరించారు.

1.బి.ఎన్.ఎస్ యాక్ట్ ఇది పాత భారతీయ శిక్షా స్మృతి (IPC) స్థానంలో వచ్చిన కొత్త చట్టం. ఇందులో శిక్షల కంటే బాధితులకు న్యాయం చేకూర్చ డానికి, నేరాల నిర్వచనాల్లో స్పష్టతకు ప్రాధాన్యతనిచ్చారు.

మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు అమలు చేయ బడతాయి.

2.బి.ఎన్.ఎస్.ఎస్ ఇది పాత నేర విచారణ ప్రక్రియ (CrPC) స్థానంలో అమల్లోకి వచ్చింది. కేసుల విచారణలో వేగం, పారదర్శకత కోసం సాంకేతికతను వీడియో గ్రాఫీ, ఆన్‌లైన్ సాక్ష్యాలు వినియో గించడం ఈ చట్టం ప్రత్యేకత.

సామాన్యులకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పని లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో న్యాయం అందేలా ఈ చట్టం రూపొందించ బడింది.

ఎస్.ఐ శుభ శేఖర్ మాట్లాడుతూ... ప్రతి పౌరుడు ఈ నూతన చట్టాల గురించి కనీస అవగాహన కలిగి ఉండాలని కోరారు.

సాంకేతిక వినియోగం ఎఫ్.ఐ.ఆర్ నమోదు నుండి విచారణ వరకు అన్నీ డిజిటలైజ్ చేయబడు తున్నాయని తెలిపారు.

త్వరితగతిన న్యాయం ఈ మార్పుల వల్ల కోర్టు కేసులు త్వరగా పరిష్కారమ వుతాయని, బాధి తులకు సత్వర న్యాయం లభిస్తుందని వివరించారు.

చట్టంపై అవగాహన కలిగి ఉండటం బాధ్య తాయుతమైన పౌర లక్షణం. నూతన చట్టాల అమలులో పోలీసులకు సహక రించండి అని అధికా రులు ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.