గొల్లల మామిడాడ కోదండ రామునికళ్యాణానికి పందిరిరాట
ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా గోపురాల గ్రామంగా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ లో చైత్ర శుద్ధ నవమి నాడు నిర్వహించే శ్రీ కోదండ రామునికళ్యాణోత్సవాలకి గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు పందిరి రాట కార్యక్రమంతో ఆలయఅనువంశిక ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాస్ రెడ్డి మీనా దంపతులు వారి కుటుంబ సభ్యులుశ్రీరామభక్తులుగ్రామస్తులు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీ రామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంసీతారాముల కల్యాణోత్సవాలను తిలకించేందుకులక్షలసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శిస్తున్నారని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనాలతో కళ్యాణం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఉద్దేశంతో ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. ఆలయ ధర్మకర్త బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భక్తులకు నిత్య అన్న ప్రసాదం సొంత సొమ్ములతో గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామాలయం ఏర్పాటు చేశానని తెలిపారు. పందిరి రాటకి రేజేటి వెంకట కూర్మ రంగనాథఆచార్యులు(పెద్దబాబు), రేజేటి వెంకట నరసింహాచార్యులు (చినబాబు) అరవీల్లి సుందర వీర రఘురామాచార్యులు రామ్ కుమార్, మంజునాథ ఆచార్యులుతోపూజలు నిర్వహించామన్నారు. పందిరి రాట మహోత్సవానికి హాజరైన శ్రీరామ భక్తులకు, గ్రామస్తులకు స్వామివారి తీర్థప్రసాదాలనుఅందజేశామన్నారు.
కార్యక్రమంలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి ధర్మకర్తల కుటుంబ సభ్యులు గ్రామ ప్రముఖులుగ్రామనాయకులు పెద్దలు శ్రీరామ భక్తులు పాల్గొన్నారు


