పి. ఆర్.సి., ఐ.ఆర్. మరియు ఇతర సమస్యలను పరిష్కరించండి- ఏపీటీఎఫ్.
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం విద్యారంగ, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఈరోజు జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయం వద్ద జంగారెడ్డిగూడెం జోన్ పక్షాన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ.పి.టి.ఎఫ్. రాష్ట్ర కార్యదర్శి బి.రెడ్డిదొర మాట్లాడుతూ 2023 జూలై నుండి 12 వ పి ఆర్ సి అమలు కావలసి ఉండగా నేటికి కూడా పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి 30% ఐ.ఆర్ ప్రకటించాలన్నారు. 3 పెండింగ్ డి.ఏ. లను మంజూరు చేయాలన్నారు. సి.పి.ఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు యాప్ ల భారాన్ని, ఆన్లైన్ పనుల భారాన్ని తొలగించి, పూర్తి సమయాన్ని బోధనకు కేటాయించడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు నివ్వాలన్నారు.పి ఎస్ హెచ్ ఏం పోస్టులను ఎస్ జి టి ల పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు.ఐటీడీఏ యాజమాన్యంలోని వసతి గృహాలలో డిప్యూటీ వార్డెన్లను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని డిమాండ్ చేశారు.
జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. దొరబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒత్తిడి లేకుండా బోధించడానికి అవకాశం కల్పించాలన్నారు. వారానికి గరిష్టంగా 32 పిరియడ్లు కేటాయించాలన్నారు. కేజీబీవీ లలో పనిచేస్తున్న వారికి మినిమం టైమ్ స్కేల్ ను వర్తింపజేయాలన్నారు.
జిల్లా కార్యదర్శి యు వి నరసింహరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో రెండవ పోస్టును మంజూరు చేయాలన్నారు.11 పి అర్ సి బకాయిలను విడుదల చేయాలన్నారు. ఎంఈఓ లకు బదిలీలు చేపట్టాలన్నారు.
జిల్లా కార్యదర్శి పివిఆర్ రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు మాతృభాషలో కూడా బోధన జరగాలన్నారు.1 నుండి 5 తరగతులను ఉన్నత పాఠశాలల నుండి వేరు చేసి ప్రాథమిక పాఠశాలలుగా కొనసాగించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను పదవీ విరమణ చేసిన వెంటనే చెల్లించాలన్నారు. మెమో నెంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. జంగారెడ్డిగూడెం మండల శాఖ అధ్యక్షులు ఐ వి రత్నం మాట్లాడుతూ 2022 నుండి చెల్లించవలసిన సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించాలన్నారు. పిఎఫ్ లోన్ల ఫైనల్ పేమెంట్ల ఏపీజీఎల్ఐ లోన్ల ఫైనల్ పేమెంట్ల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే చెల్లించాలన్నారు. నెలవారీ పదోన్నతులు చేపట్టాలన్నారు.
జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పి.జగదీష్ మాట్లాడుతూ కారుణ్య నియామకాల లో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలన్నారు. అన్ని ఆసుపత్రులలో, అన్ని వ్యాధులకు ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో జిల్లా స్థాయిలోనూ, స్థాయిలోనూ ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ ధర్నాలో జిల్లా కౌన్సిలర్ కే సతీష్ జంగారెడ్డిగూడెం మండల ప్రధాన కార్యదర్శి కే సుబ్బారావు, కొయ్యలగూడెం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం వర కుమార్, ఏ దయ రాజు, బుట్టాయిగూడెం మండల ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్, పోలవరం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే ప్రసాద్, వి వెంకటరమణ, సీనియర్ నాయకులు కే నాగేశ్వరరావు, ఉమర్ ఆలీషా, ఐజాక్, బీపీ అబ్బులు, ఎం బి త్రిపురేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


