పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజారోగ్యం మెరుగుపడుతుంది

 పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజారోగ్యం మెరుగుపడుతుంది 


పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజా ఆరోగ్యాలు మెరుగుపడతాయని రోటరీ క్లబ్ అధ్యక్షులు మాదేటి సత్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామం, మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు  పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం మెరుగగా ఉంటుందని ఆయన తెలిపారు. పంచాయతీ కార్యదర్శి రుక్మిణి మాట్లాడుతూ తమ వీధిలోకి పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడే తుక్కు వెయ్యాలని , డ్రైనేజీలలో , ఎక్కడపడితే అక్కడ తుక్కు వేయకుండా తమ పంచాయతీ సిబ్బంది వచ్చినప్పుడు వారికి సహకరించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి చిన్నబాబు, రోటరీ క్లబ్ సభ్యులు దారం సత్తిరాజు, మజ్జి సూరిబాబు, గొలిశెట్టి శ్రీనివాస్, చోడి పిండి సుబ్రహ్మణ్యం, చిరావూరి సాయి, చిక్కాల దుర్గాప్రసాద్, మంతెన సోమరాజు, మద్ధు మోహన్ , సత్యనారాయణ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.