అభివృదే ప్రధాన లక్ష్యంగా పరంపూడి సర్పంచ్ ముప్పిడి విజయ్ కుమారి

 అభివృదే ప్రధాన లక్ష్యంగా పరంపూడి సర్పంచ్ ముప్పిడి విజయ్ కుమారి 


గ్రామ అభివృద్దే ప్రధాన లక్ష్యం అని పరింపుడి గ్రామపంచాయతీ సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి పేర్కొన్నారు. స్థానిక తారక రామా నగర్ లో సోమవారం కూటమి పార్టీల నాయకులతో కలిసి జిల్లా పరిషత్ నిధులతో మంజూరైన 49 లక్షల 60 వేల రూపాయల తో చేపట్టే   నూతన డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి రామారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  గ్రామీణ ప్రాంతాలలో, పట్టణాలలో రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలు, మంచినీటి ట్యాంకులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర మహిళ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. డ్రైనేజీలలో తుక్కు వేయకుండా పంచాయతీ సిబ్బంది తమ వీధిలోకి వచ్చినప్పుడు పంచాయతీ బండిలో తుక్కును వేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ విజయ కుమారి తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు, పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజుకు, టిడిపి  నాయకులు జేష్ఠ  రామకృష్ణారావుకు  ముప్పిడి చినబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు పులపల్లి రవికుమార్, బూసి త్రిమూర్తులు, ఊసల దివ్య, సూది కొండల శివాజీ గణేష్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుల అరుణ, స్టేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పెండ్యాల రమాదేవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, జగజీవన్ రామ్ యూత్ అధ్యక్షులు బొబ్బర చిట్టిబాబు, చెప్పుల మధుబాబు, తవ్వ గోపాల్, బొలిశెట్టి వాసు , నక్క బాబి, బొబ్బర చిన్నరాజు, చిటికెన బాలగంగాధర తిలక్, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.