రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నను అభివృద్ధి, సంక్షేమానికి నిధులు కొరత లేదు


రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నను అభివృద్ధి, సంక్షేమానికి నిధులు కొరత లేదు

పట్టణాలు ధీటుగా గ్రామాలు అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

ఏలూరు/ఆగిరిపల్లి : ఆగిరిపల్లి మండలంలో  కొత్త ఈదరలో శుక్రవారం రూ 9.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి చేశారు. 

ఇందులో భాగంగా ఆగిరిపల్లి మండలం మల్లిబోయినపల్లి – కొత్త ఈదర వరకు రూ 3.70 కోట్లు వ్యయంతో నూతనంగా నిర్మించిన బీటి రోడ్ ను, అదేవిధంగా రూ1.25 కోట్లు వ్యయంతో కొత్త ఈదర గ్రామంలో నిర్మించనున్న సీసీ మరియు బిటి రహదారి పనులకు రూ 4.00 కోట్లు, రావిచెర్ల – కొత్త ఈదర ఆర్ అండ్ బి రహదారి పనులకు, కొత్త ఈదరలో రూ 36 లక్షలు వ్యయంతో నిర్మించనున్న ఆయుష్మాన్ హెల్త్ వెల్‌నెస్ సెంటరు పలు అభివృద్ధి పనులకు మంత్రి కొలుసు పార్థసారథి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలకు లోను కాకుండా, మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా రహదారులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. మన ప్రజా ప్రభుత్వంలో పండించిన పంటలకు రైతులు తమకు నచ్చిన రైసు మిల్లుకు తోలుకునే స్వేచ్ఛను ఇచ్చి గిట్టుబాటు ధరను కల్పించి 48 గంటల్లో సొమ్ములను రైతులు ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. మా హయాంలో ఒక హెక్టారుకు ఇన్పుట్ సబ్సిడీ రూ 20 వేల రూపాయలు ఉంటే గత ప్రభుత్వం రూ 16 వేలకు రూపాయలకు తగ్గించిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హెక్టరుకు ఇన్పుట్ సబ్సిడీ రూ 25 వేల రూపాయలకు పెంచామన్నారు.

 గత ప్రభుత్వంలో రైతులకు బకాయిలు పెట్టిన రూ 1650 కోట్ల రూపాయలను, ప్రజా ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఆధునిక యంత్రాలు ఒకటి కూడా అందించలేక పోయారని కనీసం బరకం ముక్క కూడా ఇవ్వలేక పోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారని వీరికి తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయ సహకారాలతో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.