నూతలపాటి నాగభూషణం కు ఘన నివాళులర్పించిన మంత్రి కొలుసు పార్థసారథి

 నూతలపాటి నాగభూషణం కు ఘన నివాళులర్పించిన మంత్రి కొలుసు పార్థసారథి



ఆగిరిపల్లి : మాజీ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి  నూతలపాటి నాగభూషణం  మృతి తెలుగుదేశం పార్టీకి మరియు యువతకు తీరని లోటని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి  కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

నాగభూషణం అంతిమయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ఆయన భౌతిక దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

నిబద్ధత కలిగిన నాయకుడు  నాగభూషణం  అని,తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాలంలో పార్టీ బలోపేతానికి, యువతను చైతన్యపరచడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన లేని లోటు

పార్టీకి తీరని లోటు అని,క్రమశిక్షణ, అంకితభావం కలిగిన ఇలాంటి నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ మరియు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

ఈ అంతిమయాత్రలో పలువురు రాజకీయ నేతలు, తెలుగు యువత ప్రతినిధులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నాగభూషణం కి కడసారి వీడ్కోలు పలికారు.