బీసీ సింహ గర్జనను విజయవంతం చేయండి,

 బీసీ సింహ గర్జనను విజయవంతం చేయండి,


హనుమాన్ జంక్షన్ , ఈ నెల 22వ తేదీ భారత చైతన్య యువజన పార్టీ(బిసివై) ఆధ్వర్యంలో బీసీ సింహ గర్జనను విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా బీసీవై పార్టీ అధ్యక్షుడు కోన నాగార్జున పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కోన నాగార్జున మాట్లాడుతూ బీసీవై పార్టీ అంటే కేవలం బీసీలకు సంబంధించింది కాదని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడేందుకు ఈ పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుందని అన్నారు. పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ లక్ష్యం ఒకటే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టి వారి భవిష్యత్తు తరాలకు బాటలు వేసే విధంగా పార్టీని స్థాపించారని అన్నారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి చూపిస్తామని తెలిపారు. ఈ బీసీ గర్జన లక్ష్యం ఒకటే బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కులాల కార్పొరేషన్ కు నిధులు, సమగ్ర కుల గణన విద్య, ఉద్యోగాలు స్థానిక సంస్థల చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా ఈ గర్జన ఉంటుందని అన్నారు. కావున ఈ బీసీ సింహ గర్జనను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసివై ఏపీ కో కన్వీనర్ కూచిపూడి వాసు దేవరావు, ఎన్టీఆర్ జిల్లా యూత్ కో కన్వీనర్ ధన్నే రవి శేఖర్, గన్నవరం నియోజకవర్గం యూత్ కన్వీనర్ తట్టి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.