దళిత ఐఏఎస్ ఐపీఎస్ లపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు,
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ లపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది ఇది ఇంకా కొనసాగితే ఆ సామాజిక వర్గ ప్రజలు కూటమి ప్రభుత్వం నకు తగిన గుణపాఠం చెపుతారు అని గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్ లపై ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని వైసిపి నేత గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి విమర్శించారు. దళిత ఐఏఎస్,ఐపిఎస్ లపై చంద్రబాబు దాష్టీకం కొనసాగుతోందని సిన్సియర్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి వేధిస్తున్నారన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లను ఏ కారణం చేత సస్పెండ్ చేశారు? పి.వి. సునీల్ కుమార్ గానీ, సంజయ్ కుమార్ గానీ, జాషువాగానీ, విశాల్ గున్ని లాంటి అధికారులను కూడా మీరు సస్పెండ్ చేశారు. కారణం ఏమిటి? ఆరోపణలు ఏమిటి? నేటికి కూటమి ప్రభుత్వం చెప్పటం లేదు. 1969 సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం వీళ్ళను సస్పెండ్ చేసే అధికారం మీకు ఉండొచ్చు. కానీ సస్పెండ్ చేసిన తర్వాత వాళ్లకు ఇచ్చే ఛార్జ్ షీట్ ఏంటి? ఆ విచారణ ఎప్పుడు పూర్తి చేస్తారు? వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఇలాగే కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తారా అని అడుగుతున్నాని అన్నారు.పోలీసు శాఖలో 130 మందికిపైగా ఏ పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నాది అబద్దమా చెప్పాలని కోరుతున్నాను అని ఆమే అన్నారు.స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి కానీ కూటమి ప్రభుత్వం లాగా అధికారులను ఎవరు వేధించలేదు.ప్రస్తుతం ఈ ప్రభుత్వం చర్యలు చూస్తుంటే కేవలం కక్ష పూరిత రాజకీయాలే కనిపిస్తున్నాయి. దళితుల పక్షాన, పేదల పక్షాన నిలబడే అధికారులను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను.అని ఆమే అన్నారు.అధికారం ఉందగదా అని ఒక గిరిజన లంబాడి కులమునకు చెందిన జిల్లా పోలీసు సూపర్డెంట్ గారిని కూడా బెదిరించటం పత్రికలు వీడియోలు ద్వారా చూస్తున్నాం.ఇది సరి కాదు ఇప్పటికైనా జరిగిన తప్పులు సరిదిద్దుకుని కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఈ ప్రభుత్వంనికి విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆమే అన్నారు.లేని పక్షంలో దీనికి ప్రతిఫలం 2029 లో జరిగే ఎన్నికలలో ఆ సామాజిక వర్గాల ప్రజలు మీకు తగిన గుణపాఠం చెపుతారు అని ఆమే హెచ్చరించారు.


