పొలాలకు వెళ్ళె తాత తండ్రులనాటి రహదారి ఆక్రమణ.

 పొలాలకు వెళ్ళె తాత తండ్రులనాటి రహదారి ఆక్రమణ.


సన్న చిన్న కారురైతుల ను ఇబ్బంది పెడుతున్న గొర్రె సర్వాంకరరెడ్డి.

చాట్రాయి మండలం బూరుగూడెం గ్రామం లో తాత తండ్రుల నాటి నుండి తమ పంటపొలాలకు పోయే రహదారిని ధన బలం తో,అంగబలంతో  గొర్ల సర్వాంకర రెడ్డి ఆక్రమిం చి,సన్న చిన్న కారు రైతులను ఇబ్బందుల కు గురిచేస్తున్నాడని చిలక బత్తుల సత్యనా రాయణ,చిలక బత్తుల దేవి, వంగల చెన్నకేశ వులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ నంబర్ 161/3 c 0.33 సెంట్లు పూర్వం నుండి పంటపొలాల కు,ముత్యలమ్మతల్లి గుడికి వెళ్ళటానికి 100లింకులు భూమి దారిగాఉన్నదని,దానిని రెండు పర్యాయాలు ఉపాదిహమీ పథకం లో పనులు చేయించ టం జరిగిందనీ తెలిపా రు, అప్పు డు అబ్యం తరం పెట్టని, సర్వాంక రెడ్డి, రెండు సవత్సరాల నుండి ఇది నా పట్టా భూమి, మీకు దారిలేద నీ, దారికి అడ్డంగా తీగ లు కట్టాడనీ, పోలీసుల కు తాసిల్దార్ కు చెప్ప గా వారు వచ్చి తీయిం చారనితెలిపారు.అయితే ఇప్పుడు అతను కోర్టులో వేసి నోటీసులు ఇచ్చాడని అది తెలియ క మేము కోర్టుకి సరియై న సమయంలోవెళ్లలేక పోయామన్నారు.వివాదం కోర్టులో ఉండగా అక్రమంగా విసన్నపేట సబ్ రిజిస్టర్ వద్ద  చేయాల్సిన రిజిస్ట్రేషన్ నందిగామలో అక్రమ గిఫ్ట్ రిజిస్ట్రేషన్, చేయిం చాడని ఆవేదన వ్యక్తం చేసారు.ఇటీవలప్రభుత్వం నిర్వహించిన రీ సర్వేలో కూడా ఇది డొంక భూమిగా నిర్ధారిం చారని తెలిపారు. తమ పంట పొలాల్లో పండిన పంటలను ఇంటికి తోలుకు వెళ్లకుండా దారి మొత్తం తన మోటారు నీళ్లతో తడిపి బురద చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని అన్నా రు. అసలు ఈ భూమి తన పట్టా అయితే తన భూమికి పెన్సింగ్ వేసిన ప్పుడు డొంక భూమి కలిపి వేసుకోవాలి కదా అలా కాకుండా డొంక భూమిని వదిలేసి తన భూమి చుట్టూ పెన్సింగ్ ఎందు కు వేసుకున్నాడ ని ప్రశ్నిస్తున్నారు. కొఃత మందికి వారే భూమి అమ్మారనీ, దాని సరి హద్దుల్లో తూర్పున డొంక దారి అని రాశార ని,ఇదంతా డబ్బు, ధప బలం ఉన్నదన్న అహకారం తో సన్న చిన్న కారు రైతులు నన్నేం చేస్తారన్న దీమా తోఇటువంటి చర్యలకు సర్వాంకరెడ్డి పాల్పడు తున్నారని గ్రామంలో పెద్దలు కొందరంటు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాది అధికారులు కల్పించు కొని తమ దారి భూమి కబ్జా కాకుండా కాపాడి న్యాయం చేయ్యాలనీ కోరుతున్నారు.