మండల పరిషత్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే అబ్దుల్ కలాం విగ్రహాలు ఆవిష్కరణ.....

 మండల పరిషత్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే అబ్దుల్ కలాం విగ్రహాలు ఆవిష్కరణ.....


మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీజే అబ్దుల్ కలాం, జ్యోతిరావు  పూలే విగ్రహాలను శుక్రవారం రాష్ట్ర ఎస్టీ సెల్ నెంబర్ కాకి లక్ష్మి, ఎంపీడీవో కిరణ్ కుమార్ తో కలిసి , ఎంపీపీ గంజిమల రామారావు , ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ఆవిష్కరించారు. దేశ నాయకుల విగ్రహాలను కార్యాలయం వద్ద ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పేర్కొన్నారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాకి లక్ష్మీ మాట్లాడుతూ అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు తమ గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.