జీతాల కంటే ముందుగానే పెన్షన్లు ఇస్తున్నాం - ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ‎

 జీతాల కంటే ముందుగానే పెన్షన్లు ఇస్తున్నాం - ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

పేదలు, వృద్ధులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కంటే ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. శనివారం ఉదయం ఏలూరు పట్టణం శనివారపుపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ..  అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి పాలన నడుస్తోందన్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల దాదాపు 63 లక్షల మంది పెన్షన్ దారులకు నెలకు 2,734 కోట్ల రూపాయల పెన్షన్లు కింద అందిస్తున్నామని, ఒక్క  ఏలూరు జిల్లాలోనే 2,58,275 మంది పెన్షన్ దారులకి ప్రతి నెల 113 కోట్లకు పైగా పంపిణీ చేస్తున్నామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. అన్ని విధాలా పేదలను ఆదుకుంటున్న కూటమి సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆదరించాలని కోరారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.