చత్రపతి శివాజీ త్రి శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డా. గాళ్ళ శ్రీనివాసరావు అధ్యక్షతన సైన్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ రసాయన శాస్త్ర అధ్యాపకులు యు. వెంకటాచార్యులు మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలను తొలగించిఆలోచనా శక్తిని శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం అని,ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్‌తో సైన్స్ ప్రాముఖ్యతను తెలియజేస్తారని 2026 సంవత్సరం వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళా శాస్త్రవేత్తలు అనే అంశానికి ప్రాధాన్యం ఇచ్చారని మహిళలు శాస్త్రవేత్తలుగా ఎదిగి వికసిత్ భారత్ నిర్మాణానికి పాటు పడాలన్నదే ఉద్దేశం అని అన్నారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డా.గాళ్ళ.శ్రీనివాసరావు మాట్లాడుతూ సి.వి. రామన్ తన ప్రసిద్ధ "రామన్ ఎఫెక్ట్"ను 1928లో ఇదే రోజున కనుగొన్నందుకుశాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి మరియు సైన్స్ లాభాలను ప్రజలకు తెలియజేయడానికి ఈ రోజును రామన్ ఎఫెక్ట్ కి గుర్తుగా నిర్వహిస్తారని, సైన్స్ వల్ల వైద్యం,సాంకేతికత,వ్యవసాయ రంగాలలో అద్భుతమైన ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. భౌతిక శాస్త్ర అధ్యాపకులు టీ వి రాంబాబు మాట్లాడుతూ ప్రాచీన కాలంతో పోల్చుకుంటే ప్రస్తుతం సైన్సు అభివృద్ధి గణనీయంగా పెరిగిందని సైన్స్ ను ఇంకా అభివృద్ధి చేసి భవిష్యత్తు నిర్మాణాన్ని మార్చవలసిన బాధ్యత విద్యార్థుల పైనే ఉందని సైన్స్ మరియు టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లయితే అన్ని రంగాల అభివృద్ధి సులభతరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ తృతీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు తులసి, అభినయ,ప్రసన్న వారు చేసిన ప్రాజెక్టును విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్.ప్రసాద్ బాబు గారు వ్యాసర రచన వక్తృత్వ పోటీలలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. కళాశాలలో సైన్స్ డే జరపడం సైన్స్ అధ్యాపకుడిగా చాలా ఆనందంగా ఉందని సైన్స్ కేవలం ఊహలపై ఆధారపడదని విషయాలు ఎందుకు మరియు ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవడానికి పరిశీలనలు మరియు ప్రయోగాలను నిర్వహించి దానికి సంబంధించిన విజ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తుందని అన్నారు.సైన్స్ డే లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రైజ్ లను కళాశాల ఐక్యూఎసి కోఆర్డినేటర్ డా. ఎం మధు, సీనియర్ అధ్యాపకులు డా. సి.హెచ్. బదరీ నారాయణ, ఆర్. విజయ దీపిక,జె.రాజా శ్రీకాంత్, సిహెచ్. షాలిని చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.


