ఆసరా లేనివారికి ఆర్ధిక భరోసా సామాజిక పెన్షన్లు. -డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి.
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం శ్రీనివాజపురం ఆసరా లేనివారికి వారికి ఆర్ధిక భరోసా కల్పించే విధంగా సామాజిక పెన్షన్ వారికి అండగా నిలుస్తున్నాయని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు.
ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పేదల సేవలో సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో టిడిపి నాయకులు మరియు సచివాలయ సిబ్బందితో కలిసి దాసరి శేషు పాల్గొన్నారు.
ఈసందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారికి పెన్షన్ నగదును స్వయంగా అందజేశారు. ఈసందర్భంగా వారితో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి నెల ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు అని ముఖ్యమంత్రే స్వయంగా ప్రతి నెలా ఒక నియోజకవర్గంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నారు అని అన్నారు.
పేదల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది అని అన్నారు.
1వ తేదీన ఆదివారం సెలవు రోజు కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి పేదల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుంది అని అన్నారు. ఒక్క పెన్షన్లు కోసమే ప్రతి నెల 2, 725 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అని తెలిపారు.
కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో గ్రామ టిడిపి కార్యదర్శి తడికల దావీదు, క్లస్టర్ ఇంచార్జ్ రాగాని రామకృష్ణ, మండల బీసీసెల్ ప్రధానకార్యదర్శి రాగాని రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్ తాళ్లూరి వెంకటేశ్వరరావు, నాయకులు పులపాకుల ప్రసాద్, పిప్పర లక్ష్మణరావు, సర్వరాయుడు, మసియ్య, రాగాని వంశీ, వీరమళ్ల పోసిబాబు తదితరులు పాల్గొన్నారు.


