సి సి రోడ్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మండల అద్యుక్షులు లంకా సత్యనారాయణ.
ఏలూరుజిల్లా ద్వారకాతిరుమల గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక కృషితో ద్వారక తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టతున్న CC రోడ్డు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ద్వారకాతిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకాసత్యనారాయణ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ఆదేశాల మేరకు, ఉపాధి హామీ నిధులతో నిర్మాణంలో ఉన్న రోడ్లను మార్చి 15వ తారీఖుకి లోపు పూర్తిచేయాలని లక్ష్యంతో, మండలంలో అన్ని గ్రామాలలో జరుగుతున్న పనులను పరిశీలించడం జరుగుతుందని, లంకా సత్యనారాయణ తెలియజేశారు, ఎవరైతే కాంట్రాక్టు దారులు మీకు.కేటాయించిన , పనులను, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటించి వాటికి అనుగుణంగా, తరగతి గతిన పనులు పూర్తి చేయాలని, ఆయన ఆదేశించారు,
ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల ఎంపిడిఓ ప్రకాష్ ,
జి కొత్తపల్లి పి ఏ సి ఎస్ చైర్ పర్సన్ రేగంటి రాంబాబు, నాదెళ్ల వెంకటేశ్వరరావు, రేవూరి నరసింహమూర్తి, మరియు స్థానిక ఎన్డియే కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


