ఆక్రమణలకు గురైన చెరువులకు విముక్తి కలిగించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

 ఆక్రమణలకు గురైన చెరువులకు విముక్తి కలిగించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి 


జిల్లా కలెక్టర్ ఏలూరు వారి ఆదేశాల ప్రకారం కొయ్యలగూడెం మండలంలోని 68 చెరువులకు సంబంధించి  సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని  కొయ్యలగూడెం తాసిల్దార్  గారికి జిల్లా కలెక్టర్  వెట్రి సెల్వి గారు ఆదేశించారు   ఈ విషయమై   సంబంధిత ఇరిగేషన్  హార్టికల్చర్ తదితర అధికారులతో కొయ్యలగూడెం తహసిల్దార్ నాగరాజు సమావేశం ఏర్పాటు చేసి కొయ్యలగూడెం మండలంలో భూగర్భ జలాలు 70 మీటర్ల లోతు అడుగంటాయని భవిష్యత్తు తరాలకు తాగునీరు సాగునీరుకు ఇబ్బందులు రాబోయే ప్రమాదం ఉందని మండలంలో గల చెరువుల  లో గల ఆక్రమణలను తొలగించుటకు కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు చెరువులలో గల పూడికలను వెంటనే  తొలగించి  చెరువు గట్టులను పటిష్టం చేసి చెరువు గట్టుపై మొక్కలు నాటాలని తెలియజేశారు ప్రస్తుతం వినియోగములో ఉన్న బోరు బావుల వద్ద  రీఛార్జ్ ఫిట్స్ ఏర్పాటు చేయాలని తెలియజేశారు 

         ఈ కార్యక్రమంలో తహసిల్దార్  కొయ్యలగూడెం ఇరిగేషన్ ఏఈ రాహుల్ భాస్కర్ ఏపీవో ఎల్ ్ శ్రీనివాస్ పాల్గొన్నారు