బూరుగ్గూడెంలో తాత తండ్రులనాటి రహదారి ఆక్రమణ.
చిన్న చిన్న కారు రైతులను ఇబ్బంది పెడుతున్న గొర్రె సర్వాంకరరెడ్డి.
చాట్రాయి మండలం బూరు గూడెం గ్రామం లో తాత తండ్రుల నాటి నుండి తమ పంటపొలాలకు పోయే దారిని ధన బలంతో, అంగబలంతో గొర్ల సర్వాంకర రెడ్డి ఆక్రమించి,చిన్న చిన్న కారు రైతులను ఇబ్బం దులకు గురి చేస్తున్నా డని చిలక బత్తుల సత్యనారాయణ, చిలక బత్తుల దేవి, వంగల చెన్నకేశవులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆర్ఎస్ నంబర్ 161/3 c 0.33 సెంట్లు పూర్వం నుండి పంటపొలాలకు,ముత్యలమ్మతల్లి గుడికి దారిగా ఉన్నదని, రెండు పర్యాయాలు ఉపాదిహమీ పథకం లో పనులు చేయించ టం జరిగిందనీ, అప్పు డు అబ్యంతరం పెట్టని, సర్వాంకరెడ్డి, రెండు సవత్సరాల నుండి ఇది నా పట్టా భూమి, మీకు దారిలేదనీ, దారిక డ్డంగా తీగలు కట్టాడనీ, పోలీసులకు తాసిల్దార్ కు చెప్పగా వారు వచ్చి తీయించారని తెలిపా రు. అయితే ఇప్పుడు అతను కోట్లు వేసి నోటీసులు ఇచ్చాడని అది తెలియక మేము కోర్టుకి సరియైన సమ యంలోవెళ్లలేకపోయామన్నారు. వివాదం కోర్టులో ఉండగా అక్ర మంగా విసన్నపేటలో చేయాల్సిన రిజిస్ట్రేషన్ నందిగామలో అక్రమ గిఫ్ట్ రిజిస్ట్రేషన్, చేయిం చాడని ఆవేదన వ్యక్తం చేసారు.ఇటీవలప్రభుత్వం నిర్వహించిన రీ సర్వేలో కూడా ఇది డొంక భూమిగా నిర్ధారిం చారని తెలిపారు. తమ పంట పొలాల్లో పండిన పంటలను ఇంటికి తోలుకు వెళ్లకుండా దారి మొత్తం తన మోటారు నీళ్లతో తడిపి బురద చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని అన్నారు. అసలు ఈ భూమి తన పట్టా అయితే తన భూమికి పెన్సింగ్ వేసినప్పుడు డొంక భూమి కలిపి వేసుకోవాలి కదా అలా కాకుండా డొంక భూమి ని వదిలేసి తన భూమి చుట్టూ పెన్సింగ్ ఎందు కు వేసుకున్నాడని ప్రశ్ని స్తున్నారు.కొఃతమందికి వారే భూమి అమ్మారనీ, దాని సరిహద్దుల్లో తూర్పున డొంక దారి అని రాశారని,ఇదంతా డబ్బు, ధపబలం ఉన్న దన్న అహకారం తో సన్న చిన్న కారు రైతులు నన్నేం చేస్తార న్న దీమాతోఇటువంటి చర్యలకు సర్వాంకరెడ్డి పాల్పడుతున్నారని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాది అధికారులు కల్పించు కొని తమ దారి భూమి కబ్జా కాకుండా కాపాడి న్యాయం చేయ్యాలనీ కోరుతున్నారు.


