రైతు విశిష్ట సంఖ్య నమోదు పై రైతులకు మేలు..

 రైతు విశిష్ట సంఖ్య నమోదు పై రైతులకు మేలు..


 

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, ఆగిరిపల్లి మండలంలోని రైతు సేవా కేంద్రం సిబ్బంది కీ జిల్లా వ్యవసాయ అధికారి షేక్. హబీబ్ భాషా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి  మాట్లాడుతు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట నిర్దిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేస్తున్నారని,11 అంకెలు ఉండే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు చాలా అవసరం అని,ఈ నేపథ్యంలో రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రంలో నమోదు చేయించుకుని ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలని తెలియజేశారు.రైతన్నల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు సేవలు అమలు చేస్తున్నాయి అని,ఈ పథకాలు అర్హులైన రైతులకు లబ్ధి చేకూర్చేలా ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట నిర్దిష్ట గుర్తింపు సంఖ్య తెలుపుతారు.

అగిరిపల్లి మండలం లోని రైతు సేవ కేంద్రాల్లో ఇంకా రైతు విశిష్ట సంఖ్య కొరకు నమోదు చేసుకొని, మిగిలి న రైతులందరికి రైతు విశిష్ట సంఖ్య నమోదు చేయవలసి ఉన్నదని వారికి కూడా త్వరగా రైతు విశిష్ట సంఖ్య నమోదు చేయాలని రైతు సేవా కేంద్ర సిబ్బందికి సూచనలు ఇచ్చి ఉన్నారు. రైతులకు జారీ చేసే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని  పిఎం కిసాన్ యోజన,  అన్నదాత సుఖీభవ,  పంటల భీమా,  వ్యవసాయ పరికరాలపై రాయితీలు,  పంట నష్టపరిహారం వంటి పధకాలు  అందాలంటే ఈ విశిష్ట సంఖ్య అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జె .భవాని, అగిరిపల్లి మండలం లోని రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.