స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు చత్రపతి శివాజీ త్రి శతజయంతి, రక్తదాన శిబిరం.
స్థానిక చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్. ప్రసాద్ బాబు అధ్యక్షతన రెడ్ రిబ్బన్ క్లబ్, రెడ్ క్రాస్ మరియు కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగాల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ఏలూరు వారిచే బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ రక్తదానం చేయటం అనేది ప్రాణదానం తో సమానమని అత్యవసర పరిస్థితుల్లో మన రక్తం వేరే వ్యక్తిని బ్రతికించడానికి ఉపయోగపడుతుందని ఇటీవల కాలంలో ఎక్కువ తలసేమియా బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారని అలాంటి వారికి మనం దానం చేసిన రక్తం ఉపయోగపడుతుందని కావున ప్రతి వ్యక్తి రక్తదానం చేయటం వల్ల కలిగే ఉపయోగాల పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్ విభాగ సమన్వయకర్త వి. హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు. రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డా. గాళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తం క్రమం తప్పకుండా దానం ఇవ్వడం వల్ల గుండెపోటు మరియు ఇతర గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది అన్నారు . కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం.వినయ్ విద్యార్థులకు రక్తదానం గురించి మాట్లాడుతూ దానం చేసిన తర్వాత, శరీరం కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది, ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిది అన్నారు.ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ ఏలూరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎన్.వి. రమణ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల నుంచి 24 మంది విద్యార్థులు రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి శ్రీనివాసరావు, రెడ్ రిబ్బన్ కమిటీ సభ్యులు జి. వెంకట్ లాల్, ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. మధు, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 1 యూనిట్ 2 సమన్వయకర్తలు డా. గల్లా శ్రీనివాసరావు,నిట్టా.వినయ్ ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

