20 నెలల్లో 5.5 కోట్ల సహాయం.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్,.. ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్.ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ.41 లక్షలకు పైగా విలువైన సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ... నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్నాం
ఏలూరు పార్లమెంటు పరిధిలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. గురువారం ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసి, ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. తాను ఎంపీ అయిన తర్వాత ఈ 20 నెలల కాలంలో.. ఆరోగ్యం బాగాలేదని చెబుతూ, వైద్యం చేయించుకోవడానికి ఆర్ధిక సహాయం కోరుతూ తన వద్దకు వచ్చిన 600 మందికి పైగా లబ్దిదారులకు 5.5 కోట్ల విలువైన CMRF చెక్కులు అందించటం జరిగిందని తెలిపారు. ఈరోజు ఒక్కరోజే 53 మంది లబ్ధిదారులకు 41,40,368 విలువైన CMRF చెక్కులు అందించటం జరిగిందన్నారు. గ్రామాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి ఏలూరు పార్లమెంట్ పరిధిలో 56 స్మశానవాటికలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. అలాగే, రోడ్లు, రైళ్లు, ఆర్వోబీలు, కొత్త ప్రాజెక్టులు తేవటం, విద్యార్ధుల భవిష్యత్తు కోసం AI ల్యాబులు ఏర్పాటు చేయటం, ఆసుపత్రులకు కొత్త పరికరాలు, అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయటం వంటి పనులు చేస్తున్నామన్నారు. గ్రీవెన్స్ కోసం భారీగా తరలివచ్చిన ప్రజలతో బుధవారం ఎంపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు.


